Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కౌలు రైతులకు రుణాలు ఇవ్వండి

విశాలాంధ్ర`ఉరవకొండ : ప్రభుత్వం గుర్తించి కౌలు రైతు గుర్తింపు కార్డులను మంజూరు చేసిన రైతులందరికీ కూడా బ్యాంకర్లు పంట రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి, కార్యదర్శి మురళి పేర్కొన్నారు. మంగళవారం ఉరవకొండ పట్టణంలో కౌలు రైతులతో కలిసి వారు యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2019 కౌలుదారు చట్టం ప్రకారం సిసిఆర్‌ కార్డులు మంజూరైన కౌలు రైతులకు బ్యాంకు రుణాలతో పాటు పంట నష్టపరిహారం,రైతు భరోసా పథకం కూడా వర్తింప చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ వీటిని ఎక్కడ కూడా అమలు చేయడం లేదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 56వేల మంది కౌలు రైతులు ఉన్నారని అయితే ప్రభుత్వం మాత్రం కేవలం2630 రైతులకు మాత్రమే గుర్తించి కౌలు రైతు కార్డులు మంజూరు చేసిందన్నారు. వీరికి కూడా సరైన న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు స్పందించి గుర్తింపు కలిగిన కౌలు రైతులకు అన్ని విధాల న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నాయకులు జ్ఞానమూర్తి, సిద్ధప్ప, వన్నూరు స్వామి, రంగప్ప ఆంజనేయులు, మల్లికార్జున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img