Friday, April 19, 2024
Friday, April 19, 2024

క్రమశిక్షణతో కూడిన విద్యను విద్యార్థులు అభ్యసించాలి..

పాఠశాల వ్యవస్థాపకులు సెట్టిపి రామిరెడ్డి,కంటి వైద్యులు డాక్టర్ ఉరుకుందప్ప.
విశాలాంధ్ర -ధర్మవరం: క్రమశిక్షణతో కూడిన విద్యను విద్యార్థులు తప్పక అభ్యసించాలని, దీంతో భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని పాఠశాల వ్యవస్థాపకులు సెట్టిపి రామిరెడ్డి,ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ ఉరుకుందప్ప,యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సెట్టిపి జయ చంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కాకతీయ విద్యా నికేతన్ లో సోమవారం విద్యార్థుల నడుమ గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా జరుపుకున్నారు. తదుపరి ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రణాళిక బద్దంగా కష్టపడి ఇష్టపడి చదివినప్పుడే జీవితములో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు. ప్రస్తుత పోటీ యుగంలో అన్ని అంశాలపై దృష్టి పెట్టినప్పుడే విజయాన్ని సాధిస్తారని తెలిపారు. అనంతరం చిన్నారుల కల్చరల్, గేమ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సెట్టిపో నిర్మల జయచంద్రారెడ్డి, డైరెక్టర్లు సూర్యప్రకాశ్ రెడ్డి, పద్మ, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img