Friday, April 19, 2024
Friday, April 19, 2024

క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం

మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి
విశాలాంధ్ర-ఉరవకొండ : రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి అన్నారు. ఉరవకొండ లో మంగళవారం జగనన్న క్రీడా సంబరాలను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి స్థానిక ఎస్కె ఉన్నత పాఠశాలలో ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే జగనన్న క్రీడా సంబరాల లక్ష్యం అన్నారు క్రీడలు శరీర దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయన్నారు. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏ ఒక్క పేద విద్యార్థి ఇటు చదువులతో పాటు అటు క్రీడలకూ దూరం కాగుడదనే ఉన్నత లక్ష్యంతో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడాని చెప్పారు.అందులో భాగంగానే అమ్మవడి, జగనన్న విద్యా దీవెన, ఇంగ్లీష్‌ మీడియం, జగనన్న క్రీడా సంబరాలు వంటివి అనేకం తీసుకొచ్చాడని తెలిపారు.జగన్మోహన్‌ రెడ్డి లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ చదువులోను..క్రీడల్లోనూ సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చందా చంద్రమ్మ, జెడ్పిటిసి ఏసీ పార్వతమ్మ, వైస్‌ ఎంపిపి నరసింహులు, సర్పంచ్‌ లలిత ,ఉప సర్పంచ్‌ వన్నప్ప, యూపీఎస్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ హరనాథ్‌, వైఎస్‌ఆర్సిపి పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు విద్యాశాఖ అధికారులు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img