Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

క్షయ వ్యాధిగ్రస్తులకు లయన్స్ క్లబ్ పౌష్టికాహారం పంపిణీ

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ పరిసర ప్రాంతాలలో క్షయ వ్యాధితో బాధపడుతున్న 40 మందిని గుర్తించి లైన్స్ క్లబ్ నిర్వాహకులు పౌష్టిక ఆహార కిట్లను పంపిణీ చేశారు. శుక్రవారం స్థానిక లయన్స్ క్లబ్ ఆవరణలో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో టిబి కంట్రోల్ అధికారి అనుపమ జేమ్స్ పాల్గొని మాట్లాడుతూ క్షయ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలిగి ఉండాలని రోజులు తరబడి దగ్గు వస్తూ ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.క్షయ వ్యాధి వచ్చిన వారికి ప్రభుత్వం అన్ని విధాల కూడా వైద్య సదుపాయాలను మందులను అందిస్తుందని ఆమె పేర్కొన్నారు. 2025 నాటికి క్షయ రహిత భారత దేశంగా మార్చాలని కేంద్రంలోని ప్రభుత్వము యొక్క ముఖ్య ఉద్దేశం అని దీనికి అనుగుణంగా అందరూ కూడా క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ వ్యాధిని మందుల ద్వారా నివారించుకోవచ్చు అని తెలిపారు. ఇది అంటూ వ్యాధి అని ఈ వ్యాధి పై ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండాలని ఆమె తెలిపారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ఉరవకొండ లయన్స్ క్లబ్ సభ్యులు పౌష్టికాహారం అందించే కిట్లను పంపిణీ చేయడం హర్షణీయమన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ హరినాథ్ రెడ్డి, డాక్టర్ సాహితీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సప్తగిరి మల్లికార్జున, సభ్యులు లక్ష్మీనారాయణ, బాలచంద్ర, సూర్యనారాయణ, సి. నాగేశ్వరరావు, ఎంసీ నాగభూషణం, గణేష్ బాబు ప్రభాకర్ నాయుడు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img