Friday, April 19, 2024
Friday, April 19, 2024

గవిమఠం రథోత్సవం ఏర్పాట్లపై ఆర్డిఓ సమీక్ష

విశాలాంధ్ర-ఉరవకొండ : అనంతపురం జిల్లా ఉరవకొండలో వెలసిన గవి మఠ స్థిత చంద్రమౌళీశ్వర స్వామి రథోత్సవం మార్చి 1,2 తేదీలలో జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం ఉరవకొండ తాసిల్దార్ కార్యాలయంలో గుంతకల్లు ఆర్డీవో రవీంద్ర, మఠం అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులను ఉద్దేశించి ఆర్డీవో మాట్లాడుతూ రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు జరగకుండా పోలీసులు భద్రత చర్యలు చేపట్టాలని రథోత్సవాన్ని తిలకించడానికి వచ్చే భక్తులకు మఠం సిబ్బంది సౌకర్యాలు కల్పించాలన్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు కూడా చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేకంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు తాగునీటి సరఫరా శాఖ అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. రథం యొక్క ఫిట్నెస్ కు సంబంధించి రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని, పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ పోస్టర్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చూడాలని రథోత్సవం పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ప్రచార కార్యక్రమాలు చేయరాదని దీనికి నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్ నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. అగ్నిమాపక, విద్యుత్, రెవిన్యూ, గ్రామపంచాయతీ సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలని భక్తుల యొక్క రాకపోకలకు సంబంధించి ఆర్టీసీ సంస్థ కూడా అవసరమున్న ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆయన సూచించారు. అన్ని శాఖల యొక్క సహకారంతో రథోత్సవం మరియు లంక దహనం కార్యక్రమాలు ప్రశాంతంగా విజయవంతంగా జరగడానికి కృషి చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఉరవకొండ తాసిల్దార్ షాబుద్దీన్, ఈ ఓ ఆర్ డి దామోదర్ రెడ్డి, ఎస్సై వెంకటస్వామి, డిప్యూటీ తాసిల్దార్ గురు ప్రసాద్, వీరితోపాటు రెవిన్యూ గ్రామపంచాయతీ, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్టీసీ, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బి, తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img