Friday, April 19, 2024
Friday, April 19, 2024

గుంతకల్లులో అకాల వర్షం..అపార నష్టం…

రైతు సంఘం ఆధ్వర్యంలో పంట పరీశీలన…

ముఖ్య అథితులు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.గోవిందు…

విశాలాంధ్ర-గుంతకల్లు : జిల్లాలో అకాలవర్షానికి భారీ పంట నష్టం వాటిల్లిందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బి.గోవిందు అన్నారు. ఈ వాతావరణానికి ఉరుములు, మెరుపులతో కూడినా గాలివానతో జిల్లా వ్యాప్తంగా, వ్యవసాయ పంటలు నేలకొరిగి నష్టపోయిన పంటల పరిశీలనలో బాగంగా శుక్రవారం మండలంలోని వైటి చెరువు గ్రామంలో మొక్కజొన్న పంట ,వరి పంటను ముఖ్య అతిథులు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బి.గోవిందు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేంద్ర, రైతు సంఘం నియోజికవర్గం నాయకులు ఉమ్మర్ బాషా,సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్ పరిశీలించారు. ఈ సందర్భంగా బి.గోవిందు మాట్లాడుతూ… జిల్లాలోని గుంతకల్లు మండలంలో వైటి చెరువు,పి .కె .చెరువు ,నాగసముద్రం వివిధ గ్రామాలలో గుత్తి,పామిడి మండలాల్లో అదే విదంగా జిల్లాలో వివిధ ప్రాంతాలలో వందలాది ఎకరాల్లో మామిడి,అరటి, బొప్పాయి, వరి మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.అకాల వర్షానికి గుంతకల్లు మండలంలోని వివిధ గ్రామ ప్రాంతాలలో దాదాపు 1300 వందల ఎకరాలలో వరి పంట చేతికి వచ్చే సమయంలో నేలకొరిగిందన్నారు. నష్టపోయిన రైతులు లబోదిబోమంటున్నారు.ఎకరాకు దాదాపు రూ.65 వేలు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో దాదాపు వందల ఎకరాలలో చెట్లు నేలకొరిగాయని అన్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడంతో రైతులు తమకు జరిగిన నష్టాన్ని ఎలా తీర్చు కోవాలో అర్థం కావడం లేదని అన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో
ఆరుగాలం కష్టపడి పంటించుకున్న పంట చేతికి అంది వచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యంతో పంట నేలకొరిగి తీవ్ర నష్టం ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ప్రతి రైతుకు ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.పంట పండించుకోవడానికి విత్తనాలు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పంట పరిశీలనలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ ఎం డి గౌస్,సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మురళికిృష్ణ ,చెన్నప్ప కొట్టాల బాషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img