Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

గుంతకల్ కార్పొరేట్ విద్యాసంస్థలు బంద్ విజయవంతం…

నారాయణ కళాశాలను వెంటనే సీజ్ చేయాలి..

నారాయణ కళాశాలకి వత్తాసుగా పనిచేస్తున్న ఆర్ ఐ ఓ ని సస్పెండ్ చేయాలి…

ఏఐఎస్ ఎఫ్ నియోజకవర్గం కార్యదర్శి వెంకట్ నాయక్

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని గత కొన్ని రోజుల క్రితం నారాయణ కళాశాలలో జరిగిన ఘటనకు నారాయణ కళాశాలను సీజ్ చేయాలని శుక్రవారం ఏఐఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ విద్యాసంస్థల బంద్ ను నిర్వహించారు.విద్యాసంస్థలు బంద్ లో పాల్గొన్న ఏఐఎస్ ఎఫ్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు ఏఐఎస్ ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి వెంకట్ నాయక్ ,ఆర్గనైజింగ్ కార్యదర్శి వినోద్ ,పట్టణ సహాయ కార్యదర్శి రాజ్ కుమార్ లను తరలించారు.ఈ సందర్భంగా ఏ.ఐ.ఎస్.ఎఫ్ పట్టణ సహాయ కార్యదర్శి అఖిల్ మాట్లాడుతూ గుంతకల్లు లో ఉన్నటువంటి విద్యాసంస్థలు అన్నిచోట్ల బంద్ చేయడం జరిగిందన్నారు.విద్యార్థుల తల్లితండ్రులను ఫీజుల పేర్లతో విద్యాసంస్థల యాజమాన్యులు వేధిస్తున్నారన్నారు.. గత కొన్ని రోజుల క్రితం అనంతపురం లోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న భవ్య శ్రీ అనే అమ్మాయి ఫీజు కట్టలేదని కళాశాల యాజమాన్యమే ఒత్తిడి వల్ల ఆత్మ హత్యాయత్నాకి పాల్పందన్నారు. జిల్లా ఆర్ ఐ ఓ ఇంతవరకు ఆ కళాశాల పైన ఏ మాత్రం చర్యలు తీసుకోకుండా వారికి వత్తాసుగా పనిచేస్తున్నారని అన్నారు.ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయానికి తప్పుడు నివేదికను పంపుతూ ఈ ఘటనను తప్పుదావ పట్టిస్తున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి తక్షణమే నారాయణ జూనియర్ కళాశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో ఏ.ఐ.ఎస్.ఎఫ్ పట్టణ నాయకులు సురేష్,చిన్న, తేజ, వంశీ, శ్యామ్,రోహిత్ ,పవన్,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img