Friday, April 19, 2024
Friday, April 19, 2024

గురుకుల పాఠశాలలో ‎వైద్య శిబిరం

విశాలాంధ్ర- ఉరవకొండ : పరీక్షల సమయంలో విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా వుండటానికి ఉరవకొండ పట్టణంలో డాఁ బి.ఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు శనివారం వైద్య శిబిరం ఏర్పాటు ఏర్పాటు చేసినట్లు ఉరవకొండ కమ్యూనిటీ హాస్పిటల్ వైద్యాధికారి డాక్టర్ టి. సాహితీ తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య శిబిరం లో జ్వరం, దగ్గు తో బాధ పడు విద్యార్థులు కు రక్త పరీక్ష లు నిర్వహించి, మందులు పంపణీ చేశామని 64 మంది విద్యార్థుల కు వైద్యము అందించడమే కాకుండా ఆరోగ్య,విద్య ద్వారా విద్యార్తులు కు స్కూల్ టీచర్స్ కి మరియు స్కూల్ సిబ్బంది కి హెచ్3 ఎన్ 2 ఇన్ఫ్లుఎంజా వ్యాధి లక్షణాలు గొంతు నొప్పి, జ్వరము , చలి ముక్కు నుండి నీరు కారడం, వాంతులు, కొద్దిమందిలో ఆయాసం వంటి లక్షణాలు పై అవగాహన మరియు నివారణ చర్యలు లో బాగంగా చేతుల తరుచూ శుభరపరుచుకోవడం, మాస్క్ ధరించడం, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోవడం, గుంపులు కు దూరంగా ఉండటం పై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ఇంఛార్జి ప్రిన్సిపల్ కె.భారతి , వైస్ ప్రిన్సిపల్ ఎం జయమ్మ, పట్టణ ఆరోగ్య సిబ్బంది నిమ్మల వెంకటేష్, మోతీ లాల్ నాయక్, హెల్త్ ప్రొవైడర్ సులోచన మరియు ఆశా కార్యకర్త మేరీ మంజుల, గురుకుల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img