సర్పంచ్ బోయ రామాంజనేయులు
విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ మండలం రేణిమాకులపల్లి గ్రామంలో ఈనెల 17,18 తేదీలలో జరిగే మారెమ్మ దేవత గ్రామ దేవర ఉత్సవానికి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ బోయ రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో ప్రజలందరూ కూడా కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఈ ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటున్నామని ఉత్సవానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు అదేవిధంగా పార్కింగ్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో పారిశుధ్య పనులు వీధి దీపాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. గ్రామంలో జరిగే ఉత్సవానికి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని ఆయన తెలిపారు.