Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఘనంగా కళాప కర్షణ- బాలాలయ మహోత్సవాలు

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని సిద్దయ్య గుట్ట లో గల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శనివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వివిధ కార్యక్రమాలతో, విశేష పూజలతో, ఆలయ కమిటీ, భక్తాదులు దాతల ఆధ్వర్యంలో కళాపకర్షణ-బాలా లయ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు ఎస్ .జయశ్రీ, ఉపాధ్యక్షులు పుట్లూరు నరసింహులు, కార్యదర్శి గంజికుంట బాలగంగాధర్, కోశాధికారి కలవల మురళీధర్ పేర్కొన్నారు. తొలుత ప్రధాన అర్చకులు రవీంద్రనాథ శర్మ పరశురామ శర్మలతోపాటు స్థానిక రిత్వికులు.. వెంకట శేషయ్య ,భరత్ సింహా, రాజశేఖర్ శర్మ, వెంకటేష్ శర్మలు మహా గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్య, కలశ మంటప ఆరాధన లను వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం ప్రధాన కుంభమునందు లక్ష్మీనరసింహస్వామి కళాపకర్షణ ప్రాణ ప్రతిష్టను అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత గణపతి, నవగ్రహ, లక్ష్మీనరసింహస్వామి, మాల మంత్ర సుదర్శన, శాంతి హోమాలు నిర్వహించారు. తదుపరి మధ్యాహ్నం మహా పూర్ణహుతితోపాటు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి మూల విరాటు ప్రధాన కలశ ఉత్సవ మూర్తుల బాలాలయ ప్రవేశం, తదుపరి దేవత మూర్తులకు సోడోపచార పూజలు, మహా మంగళహారతీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున దంపతులు కూడా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి సంఘం కమిటీ అధ్యక్షులు జయశ్రీ, ఉపాధ్యక్షులు పుట్లూరు నరసింహులు, గౌరవ అధ్యక్షులు గడ్డం పార్థసారథి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేని విధంగా మూడు కోట్ల రూపాయలతో ఈ దేవాలయాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నామని, దాతలు, భక్తులు కూడా ధన, వస్తు రూపేనా విరాళాములు అందించి, ఆలయ అభివృద్ధికి తమ సహాయ సహకారాలను అందించాలని వారు కోరారు. దాతల సహకారంతో కళ్యాణ మండపము, భక్తుల తలనీనాల కొరకు కళ్యాణకట్ట ,గరుత్మంతుని విగ్రహ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు, ఆలయ కార్యదర్శి బాల గంగాధర్, కోశాధికారి కలవల మురళీధర్, డైరెక్టర్లు కృష్ణ,జయప్రకాష్ లతోపాటు వందలాదిమంది భక్తాదులు, అధికారులు అనధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img