Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు…

విశాలాంధ్ర-గుంతకల్లు : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్బంగా గురువారం గుంతకల్లు మాజీ శాసన సభ్యులు ఆర్. జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో టిడిపి కార్యాలయం నుండి ర్యాలీ గా హాజరత్ మస్తానయ్య దర్గా లో చంద్రబాబు నాయుడు పేరుపైన చదివింపులు చదివించారు.అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో జితేంధ్ర గౌడ్ భారీ కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లి అక్కడున్న రోగులకు పండ్లు బ్రెడ్లు పంచారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదురుగా అన్నదానం నిర్వహించారు.. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చంద్రబాబు నాయుడు మాత్రమే తీర్చగలరని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి ఆర్. పవన్ గౌడ్, టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బిఎస్ కృష్ణారెడ్డి, యువనాయకుడు ఆర్. అనిల్ గౌడ్ ,యూత్ లీడర్ ఆర్. ధర్మ తేజ్ గౌడ్ ,పార్లమెంట్ కార్యదర్శి గుమ్మునూరు వెంకటేశులు, మాజీ ఎంపీపీ ప్రతాప్ నాయుడు,బీసీ సెల్ నాయకులు కేసప్ప,తెలుగుయువత అధ్యక్షుఢు వాల్మికి రాము,కురువ శివన్న,కురువ సురేష్ ,కసాపురం రంజాన్ , తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img