Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర- ఉరవకొండ : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను గురువారం ఉరవకొండ లోని టిడిపి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు కేక్‍ కట్‍ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్న చంద్రబాబు 71 ఏళ్లు పూర్తి చేసుకుని 72వ ఏట అడుగు పెట్టారని నేతలు వెల్లడించారు. రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. విభజన గాయాలతో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఏర్పాటైన రాష్ట్రాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చారని గుర్తు చేశారు. ఆంధప్రదేశ్‍ మళ్లీ గాడిలో పడాలంటే చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకున్నట్టు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img