Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఘనంగా జరిగిన గోదాదేవి కల్యాణోత్సవం

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయంలో ధనుర్మాస చివరి రోజు శనివారమున దేవాలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం దంపతుల ప్రత్యేక పూజలను అర్చకులు నడుమ నిర్వహించారు. దాశెట్టి సుబ్రహ్మణ్యం ధనుర్మాస పూజ దాతగా వ్యవహరించిన అనంతరం ఇదే రోజు శనివారశీ ఆలయంలో గోదాదేవి కల్యాణోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా అర్చకులు మకరంద బాబు, భాను ప్రకాష్, కోనేరా చార్యులు, చక్రధర్ ల నడుమ వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా భక్తాదుల నడుమ నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో ఈ కళ్యాణోత్సవ వేడుకలకు వందలాదిమంది భక్తాదులు పాల్గొన్నారు. ఈ కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలను చైర్మన్ దంపతులు సమర్పించారు. ప్రసాద దాతగా, కల్యాణోత్సవ దాతగా కూడా ఆలయ చైర్మన్ వ్యవహరించారు. దాదాపు ఈ కళ్యాణోత్సవం 3 గంటలపాటు ఎంతో వైభవంగా నిర్వహించడం పట్ల భక్తాదులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తదుపరి అన్నమయ్య సేవా మండలి పోరాల పుల్లయ్య శిష్య బృందం ఆలపించిన, అన్నమాచార్య సంకీర్తనలు, భక్తాదులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తదుపరి అర్చకులు భోగి పండుగ యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు. అనంతరం అర్చకులు దేవాలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం దంపతులను ఘనంగా శాలువా పూల మాలలతో సన్మానించారు. తదుపరి సాయంత్రం ఆలయంలో చెన్నకేశవ స్వామి, భూదేవి, శ్రీదేవి ఉత్సవ విగ్రహాలకు పూల అలంకరణ చేసిన తర్వాత, ప్రాకార ఉత్సవమును కూడా భక్తాదుల నడుమ అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకటేశులు, ఆలయ ఉపాధ్యక్షులు కుండా చౌడయ్య తో పాటు ఆలయ డైరెక్టర్లు, ఆలయ మేనేజర్ రామశాస్త్రి, సిబ్బంది మల్లికార్జున, హరి, కృష్ణ, వందలాదిమంది భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img