Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఘనంగా జరిగిన ముక్కోటి ఏకాదశి వేడుకలు

విశాలాంధ్ర- ధర్మవరం: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో సోమవారం ముక్కోటి ఏకాదశి వేడుకలను భక్తాదులు, ఆలయ పాలక మండలి, దాతల నడుమ ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, వైస్ చైర్మన్ కుండ చౌడయ్య, ఈవో వెంకటేశులు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వెలుపలి భాగం, బయటి భాగం మొత్తం విద్యుత్ దీప అలంకరణతోను, వివిధ పూలమాలలతో ఆకర్షించే విధంగా చక్కటి అలంకరణ గావించారు. ఆవరణ ముందు శంకు చక్రాలు, వినాయకుని యొక్క విద్యుత్ దీపాలంకరణ రూపంలో ఉన్న అలంకరణ భక్తాదులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుండి ఉత్తర ద్వారా, సాయంత్రం దక్షిణ ద్వారము ద్వారా భక్తాదులు క్యూ వరసలో వస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. దాదాపు 35 మంది దాకా 4వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు పుష్పాలంకరణకు దాతలుగా నిర్వహించారు. మూల విరాట్ కు పుష్పాలంకరణ ఉభయ దాతలుగా కీర్తిశేషులు దాశెట్టి ఓబులమ్మ దాశెట్టి నారాయణ స్వామి, ఉత్తర ద్వారా ప్రవేశం పుష్పాలంకరణకు ఉభయ దాతలుగా కీర్తిశేషులు మోకా చిన్న వెంకటసుబ్బయ్య మనవడు రాఘవేంద్ర రవితేజ- హైదరాబాద్ వారు నిర్వహించారు. దక్షిణ ధర ద్వారా ప్రవేశం ప్రత్యేక పుష్పాలంకరణ ప్రసాద వినియోగ ఉభయ దాతలుగా అంబటి నాగరాజు అంబటి శ్రీధర్లు నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవం కు ఉభయ దాతలుగా దాశెట్టి పద్మావతి దాశెట్టి సుబ్రమణ్యము వ్యవహరించారు. స్వామివారిని దర్శించేందుకు స్థానికంగా కాక ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి వేలాదిమంది సహనముతో స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తాదులు గంటల తరబడి నిరీక్షించి స్వామి వారిని దర్శించుకుని విజయవంతం చేశారు. అర్చకులు కోనేరాచార్యులు మకరంద బాబు భాను ప్రకాసులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ స్వామివారికి ప్రత్యేక అలంకరణతో పాటు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్ల మధ్య, ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తాదులు వరుసలో వెళ్లి దర్శనం చేసుకున్నారు. గత సంవత్సరము కంటే ఈ సంవత్సరం దేవాలయంలో వివిధ పుష్పాలచే ఆకర్షించే విధంగా పుష్పాలంకరణ అందరిని ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో స్థానిక జడ్జితో పాటు ఆర్డిఓ తిప్పే నాయక్, పెనుకొండ ఎమ్మెల్యే శంకర్నారాయణ కుటుంబ సభ్యులు, మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల, వైస్ చైర్మన్లు పెనుజూరు నాగరాజు, భాగ్యలక్ష్మి వివిధ రాజకీయ పార్టీ నాయకులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు జగ్గా జయలక్ష్మి, సరస సౌందర్యలహరి, గిర్రాజు మహాలక్ష్మి, సత్రశాల అశ్వత్ నారాయణ, పోరాళ్ల పద్మావతి, దాడి తోట సునీతలతో పాటు వేలాది మంది భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img