Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఘనంగా జరిగిన రథసప్తమి వేడుకలు

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానంలో శనివారం ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ కమిటీ, అర్చకులు మకరంద బాబు, భాను ప్రకాష్, అర్చక చక్రధర్ లు, దాతలు, భక్తాదుల నడుమ అత్యంత వైభవంగా రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ధర్మవరంలో మొట్టమొదటిసారిగా తిరుమల, తిరుపతి దేవస్థానంలో నిర్వహించే రథసప్తమి వేడుకలను, ఇక్కడ నిర్వహించడం పట్ల పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, భక్తాదులు, అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ రథసప్తమి వేడుకలు పాలక మండలి, విరాళం ఇచ్చిన దాతలు, భక్తాదులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ రథసప్తమి వేడుకలకు దాదాపు 14 మంది 5000 రూపాయల నుంచి 25 వేల రూపాయల వరకు విరాళాలు ఇవ్వడం, రథసప్తమి వేడుకకు ఏడూ వాహనాలను తయారు చేసి ఇచ్చిన దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలిపి, వారి పేరిటన ప్రత్యేక పూజలు చేసి ,ఘనంగా సత్కరించారు. ఉదయం నుండి రాత్రి వరకు సూర్యప్రభ, శేష, గరుడ, హనుమంతు, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలలో పట్టణ పురవీధుల గుండా ఊరేగించడం జరిగిందని తెలిపారు. పురవీధులలో నిర్దేశించిన ప్రాంతంలో మాత్రమే హారతి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. నూతనంగా సూర్య ప్రభ హనాన్ని డిఎన్ఎమ్. సుందర్ రేషన్ వారి కుమారులు, నూతన శేష వాహనం చేయించిన దాతలు కీర్తిశేషులు ఆదిమూలం రామిశెట్టి జ్ఞాపకార్థం భార్య యశోదమ్మ,కుమారులు ఆదిమూలం లక్ష్మీ చెన్నకేశవులు వ్యవహరించారని తెలిపారు. వన్ టౌన్ సీఐ. సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పోలీసులు భద్రతను ఏర్పాటు చేయడం పట్ల కూడా చైర్మన్ కృతజ్ఞతలు తెలియజేశారు. గోదా రంగనాథ మహిళా సంఘం వారి కోలాటం భవాని వారి శిష్య బృందం, అన్నమాచార్య సంకీర్తన సంగం పురాళ్ల పుల్లయ్య శిష్య బృందం చేసిన కార్యక్రమాలు భక్తాదులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ వైస్ చైర్మన్ కుండ చౌడయ్య, ఆలయ ఈవో వెంకటేశులు, డైరెక్టర్లు జగ్గా జయలక్ష్మి, సౌందర్యలహరి, గిర్రాజు మహాలక్ష్మి, సత్రశాల అశ్వత్త నారాయణ, పోరాల్ల పద్మావతి, సునీత, వందలాదిమంది భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img