Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఘనంగా జరిగిన 15వ వార్షికోత్సవం

విశాలాంధ్ర-ధర్మవరం : పట్టణంలోని యశోద కాన్సెప్ట్ స్కూల్లో శుక్రవారం 15వ వార్షికోత్సవం వేడుకలు పాఠశాల ఆవరణంలో వైబ్రేశీట్-2023నీ విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అతిధుల మధ్య ఘనంగా జరుపుకున్నట్లు పాఠశాల డైరెక్టర్ రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా యోగి వేమన యూనివర్సిటీ పీహెచ్డీ ఫార్మా రిజిస్టర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, అనంతపురం ఎస్కే యూనివర్సిటీ డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ హుస్సేన్ వీర లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గత సంవత్సరం పదవ తరగతి పరీక్షలో 10 గ్రేట్ పాయింట్ సాధించిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్య సభ్యులు చైర్మన్ శంకర్ నారాయణ, డైరెక్టర్ రవీంద్ర, కరస్పాండెంట్ మల్లికార్జున ప్రత్యేకంగా అభినందించి, జ్ఞాపికలతో 5000 రూపాయలు ప్రోత్సాహక బహుమతులు కూడా అందజేశారు. అనంతరం శంకర్ నారాయణ, రవీంద్రలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పదవ తరగతిలో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారని, ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి సహకరించిన తల్లిదండ్రులకు యాజమాన్య సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల ప్రధానాచార్యులు పాఠశాల వార్షిక నివేదికను అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన భరత కూచిపూడి లాంటి శాస్త్రీయ నాట్యాలు కోలాటం లాంటి జానపద నృత్యాలు సందేశాత్మకమైన దేశభక్తిని మాననీయ నైతిక విలువలను ప్రబోధించే నాటికలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ పృధ్వి రాజు, పట్టణ ప్రముఖులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img