Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

విశాలాంధ్ర`ఉరవకొండ : శ్రీనివాస రామానుజన్‌ 135 జయంతి పురస్కరించుకుని ఉరవకొండ మండలం మోపిడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేషగిరి ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణిత శాస్త్రం కు సంబంధించిన గణిత నమూనాలు తో కూడిన ప్రదర్శనలో విద్యార్థులు చేసిన వివిధ రకాల గణిత నమూనాలు వాస్తవ సంఖ్యలు , అంతర కోణాలు, మేజిక్‌ చార్ట్‌, వేళ్ళతో త్రికోణమితి నిష్పతి ని కనుగొనుట వంటి నమూనాలు అందరినీ ఆకర్షించాయి. ఈ ప్రదర్శనలో విద్యార్థులు గణితం యొక్క గొప్పతనం మరియు ఉపయోగాలు ను గణితం యొక్క ప్రాధాన్యత విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే పద్ధతిలో పాటల గేయాల, డాన్స్‌ లు రూపం లో చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలతో కూడిన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అంద చేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమిద్యల ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగ మంజుల, రాకెట్ల హెచ్‌ఎం సుంకన్న, కౌకుంట్ల హెచ్‌ఎం విజయ భారతి, గణిత ఉపాధ్యాయురాలు విజయ, గ్రామ సర్పంచ్‌ సిద్ధప్ప, పాఠశాల కమిటీ ఛైర్మన్‌ సతీష్‌, ఉప సర్పంచ్‌ లీలప్ప ఉపాద్యాయులు చంద్రశేఖర్‌, మల్లికార్జున, ప్రభాకర్రెడ్డి, సువర్ణ, నాగరత్న, మీన, ప్రభాకర్‌ లు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img