Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

విశాలాంధ్ర-పెనుకొండ : బాబా సాహెబ్ అంబేద్కర్ 132 జయంతి సందర్భంగా పెనుకొండ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ లో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఎమ్మెల్యే శంకర నారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి . ఆ మహనీయుడు బాటలో మన జగనన్న పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయసాదరికతలో నడుస్తూ దేశంలో ఎక్కడ లేనివిధంగా మా నాయకుడు ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img