Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి

జయంతి సందర్భంగా కళాశాలలో స్వచ్ఛభారత్

విశాలాంధ్ర – పెనుకొండ : స్థానిక పిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. నీలం రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఆదర్శ పౌరులుగా ఎదగడానికి విద్యార్థులందరూ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తదనంతరం, కళాశాలలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ, జూనియర్ లెక్చరర్ గా ప్రమోషన్ పొంది ,పులివెందుల జూనియర్ కళాశాలకి బదిలీపై వెళుచూ కళాశాల గ్రంధాలయానికి పుస్తకాలను వితరణ చేసిన డా. జెన్నే ఆనంద్ కుమార్ కి కళాశాల వీడ్కోలు పలుకుతూ సన్మానం చేశారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కళాశాలలో స్వచ్ఛభారత్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా. కే. జయప్ప, ఐక్యుఏ సి కోఆర్డినేటర్ శ్రీనివాసులు ఎన్ఎస్ఎస్ అధికారులు ఓబులేసు, రంగనాయకులు అధ్యాపకులు హరీష బాబు, శ్రీదేవి,హరి, బాలారెడ్డి, గంగరాజు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img