Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఘనంగా సహకార వారోత్సవాలు

విశాలాంధ్ర`అనంతపురం(వైద్యం) : 69 అఖిలభారత సహకార వారోత్సవాలు 4 వ రోజు రాయల సీమ సహకార శిక్షణ సంస్థలో గురువారంఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎ.డి. సిసి బ్యాంకు చైర్‌ పర్సన్‌ లిఖిత మాట్లాడుతూ, దివగంత నేత రాజశేఖర్‌ రెడ్డి సహకార బ్యాంకులకు షేరు ధనము ఇచ్చి నష్టాలలో వున్న బ్యాంకులను లాభాల బాటు నడవ డానికి చాల కృషిచేశారన్నారు. ముఖ్య మంత్రి జగన్మోషన్‌ రెడ్డి సహకార బ్యాంకులు, సంఘల అభివృద్దికి పటిష్టమైన చర్యలు చేపట్టారని తెలియ చేసారు. ప్రతి సిబ్బంది భాద్యతాయుతంగా పని చేసి తమ సంస్థల అభివృద్ధికి కృషిచేయాలని కోరారు.. బ్యాంకు జనరల్‌ మేనేజరు సురేఖ రాణి మాట్లాడుతు… సకార సంఘాలు అతి త్వరలో కంప్యూటర్‌ రేజేషన్‌ పూర్తి గావించుకొని రైతులకు పారదర్శక సేవలు అందచేస్తాయని తెలియచేశారు. బ్యాంకు అందిస్తున్న వివిధరకాలైన సేవల గురించి తెలియ చేసారు. జిల్లా సహకార అధికారి ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. సహకార బ్యాంకులు, కూడా వాణిజ్య బ్యాంకులకు ధీటుగా అన్ని రకాలైన సేవలు అందిస్తున్నాయని వాటిని ఖతాదారులు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రసహకార యూనియన్‌ చైర్మెన్‌ రాఘవ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి రైతుల పక్షపాతి అని వారికి సకాలంలో రావలసిన వడ్డీ రాయితీలు ఇతర ప్రోత్సాహకాలు సహకార బ్యాంకులు, సంఘల ద్వారా ఎప్పటికప్పుడు వారి ఖాతాలలో జమ అగుటకు సత్వర చర్యలు తీసుకొంటున్నట్లు తెలియ చేసారు. రాష్ట్ర సహకార యునియన్‌ మేనేజింగ్‌ డైరెక్టరు అలీ అక్బర్‌ మాట్లాడుతూ… సహకార బ్యాంకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇనుమడిరప చేసుకొని ఖతాదారులకు పారదర్శక సేవలు అందచేస్తున్నారు అని పేర్కొన్నారు. ఎ.డి.సి.సి బ్యాంకు విశ్రాంత సి.ఇ.ఒ తీయులేటి నరసింహరెడ్డి, ఆర్‌ సి టి సి మాజీ ప్రిన్సిషల్‌ సురేందర రెడ్డి,ఇందిరాదేవి సహకార వారోత్సవాల విశిష్ఠత గురించి తెలియ చేశారు. ఆర్‌.స .టి సి ప్రిన్సిప్‌ ల్‌ శ్రీనివాసులు వందన సమర్పిణ గావించారు. ఈ కార్యక్రమంలో ఎ.డి.సి.సి చినుకు సిబ్బంది, సహకార శాఖ సిబ్బంది. శిక్షణా సంస్థ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img