Friday, April 19, 2024
Friday, April 19, 2024

చిన్న తరహా పరిశ్రమలకు సబ్సిడీ రుణాలు ఇవ్వండి

దళిత ఇండస్ట్రియల్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ మీనుగ గోపాల్

విశాలాంధ్ర-ఉరవకొండ : చిన్న తరహా పరిశ్రమలకు మరియు ఎస్సీ ఎస్టీలకు ఉపాధి అవకాశాల కోసం సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని దళిత ఇండస్ట్రియల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోపాల్ అన్నారు. శనివారం అనంతపురంలో జిల్లా పరిశ్రమ శాఖ జనరల్ మేనేజర్ నాగరాజురావు మరియు ఎల్డీఎం నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో బ్యాంకు రుణాలు సద్వినియోగం అనే అంశంపై జరిగిన సమావేశంలో గోపాల్ పాల్గొని అనేక అంశాలపై చర్చించారు. దళిత ఇండస్ట్రియల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఎంతో మంది యువతీ యువకులకు పరిశ్రమలు ఏర్పాటు పై శిక్షణ ఇచ్చి పారిశ్రామికవేత్తలు గా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి సుదర్శన్ గారు దీనిని స్థాపించడం జరిగింది. జిల్లా స్థాయిలో జరిగే బ్యాంకర్స్ మీటింగ్ కు అసోసియేషన్ తరపున డి.ఐ.ఏ ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని మరియు పరిశ్రమల ఏర్పాటులో బ్యాంకర్స్ సహాయం ఎంతో అవసరమని పరిశ్రమలు ఏర్పాటులో ఏదైనా సమస్యలను వారిదృష్టికి తీసుకు వెళ్ళుటకు ఈ మీటింగ్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీలకు వెహికల్ లోన్స్ పై 45% సబ్సిడీ లోన్స్ ఉన్నాయి. మరియు ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీ, మరియు ఓసీ మహిళలకు మరియు చిన్న తరహా పరిశ్రమలకు ఏర్పాటు చేసుకొనుటకు పీఎంఈజీబీ .స్టాండ్ ఆఫ్ ఇండియా ఇతర స్కీముల ద్వారా 35% సబ్సిడీలతో కూడిన లోన్లు ఉన్నాయని వీటిని జిల్లా స్థాయిలో యువతీ యువకులు అప్లై చేసుకుని అభివృద్ధి చెందాలని అలాగే అప్లై చేసుకొనుటలో భాగంగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని బ్యాంకర్లు కూడా ముందుకు వచ్చి దరఖాస్తు చేసుకున్న వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img