Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చిన్న, పెద్ద శేష వాహనాల్లో దర్శనమిచ్చిన వెంకటేశ్వర స్వామి

విశాలాంధ్ర-ధర్మవరం : పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా రెండవ రోజు ఉదయము చిన్న శేష వాహనములోనూ రాత్రి పెద్ద శేష వాహనములోనూ భక్తాదులకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు భక్తాదులకు దర్శనమిచ్చారు. అర్చకులు సుదర్శనాచార్యులు, సునీల్ కుమార్ ల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ ప్రత్యేక పూజలు చేసి పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. ఈ బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థాన స్వాములచే నిర్వహించారు. విశ్వ కేశన ఆరాధన, యాగశాల ప్రవేశం ద్వారా తోరణ ధ్వజ కుంభస్పూజ, ఆరాధన నిత్య, మూలమంత్ర హోమాలు, సాయంత్రం ద్వార తోరణ ధ్వజ కుంభ పూజ నిత్య శాంతి మూలమంత్ర పరివార హోమాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలుకు వాహన ఉభయ సేవాకర్తలుగా లక్ష్మీదేవి, సీతారామయ్య జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్.. సీతారామయ్య ఆలయ కమిటీ, దాతల సహాయ సహకారముతో నిర్వహిస్తున్నందుకు కమిటీ ప్రతినిధులు మేటికలకుల్లాయప్ప, దత్త శివ, బేళ్లే నాగప్ప, సాగా సురేష్, శంకర సంజీవులు, రంగా శీన, గుద్దిటి రామాంజనేయులు కృతజ్ఞతలు తెలియజేశారు. దేవాలయాలోని వివిధ పూలలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img