Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

చౌడేశ్వరి దేవి జ్యోతుల ఉత్సవాలకు డోలా రాజారెడ్డి ఆర్థిక సహాయం

విశాలాంధ్ర- ధర్మవరం : సంక్రాంతి పర్వదిన సందర్భంగా ప్రతి ఏడాది పట్టణంలోని అన్ని వార్డులలో చౌడేశ్వరి దేవి జ్యోతుల ఉత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పట్టణంలోని 27వ వార్డులో నిర్వహించే చౌడేశ్వరి దేవి జ్యోతుల ఉత్సవ కార్యక్రమానికి 27వ వార్డు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌, ఆర్టీసీ డివిజన్‌ గౌరవాధ్యక్షులు డోలా రాజారెడ్డి తన నివాసంలో చౌడేశ్వరి దేవి జ్యోతులు ఉత్సవ కమిటీ సభ్యులకు రూ ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ అవసరమైతే మరింత ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. దీంతో కమిటీ సభ్యులు డోలా రాజారెడ్డిని చౌడేశ్వరి దేవి జ్యోతుల ఉత్సవాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేసి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో చౌడేశ్వరి దేవి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img