Friday, April 19, 2024
Friday, April 19, 2024

జగనన్నే మా నమ్మకం మా భవిష్యత్ కార్యక్రమానికి అనుహ్యస్పందన

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ పట్టణము నందు శనివారం జగనన్నే మా భవిష్యత్తు జగనన్నే మా నమ్మకం అనే కార్యక్రమం విజయవంతమై ప్రజల నుంచి మంచి స్పందన లభించడంతో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు వైయస్ విగ్రహానికి పూలమాలవేసి పట్టణంలో పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించి నినాదాలతో ఊరెత్తించారు అనంతరం ఎమ్మెల్యే కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నారాయణ మాట్లాడుతూ జగన్ అనే మా భవిష్యత్తు జగన్ అనే మా నమ్మకం అనే కార్యక్రమాన్ని ఈనెల 7వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రంలో మొత్తం ఒక 1.65 లక్షల కుటుంబాలు ఉండగా అందులో గృహసారథులు సచివాలయ కన్వీనర్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు వైఎస్ఆర్సిపి నాయకులు ప్రజా ప్రతినిధులు మొత్తం కలిపి ఒక 1. 45 లక్షల కుటుంబాలను కలుసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల పీపుల్ సర్వే నిర్వహించగా ప్రభుత్వము చేస్తున్న పనుల పట్ల ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఒక 1.10 లక్షల మంది తమ యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వము నిర్దేశించిన ఫోన్ కాల్ మిస్డ్ కాల్ ఇచ్చి తమ యొక్క సంఘీభావాన్ని తెలిపారనీ చరిత్రలో అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడు ఇటువంటి సాహసపేతమైన నిర్ణయం చేయలేదని జగనన్న ప్రజల యొక్క నాడిని తెలుసుకోవడానికి ఈ సర్వే ద్వారా తమ యొక్క మద్దతును తెలుసుకునడానికి చేసిన ప్రయత్నం మంచి ఫలితాలను రాబట్టిందని 80% ప్రజలు తమకు మద్దతు తెలిపారని ఆయన తెలిపారు సత్యసాయి జిల్లాలో కూడా 80 శాతం ప్రజలు వైయస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు పలికినట్లు సర్వేల ద్వారా తెలిసింది అలాగే పెనుకొండ నియోజకవర్గంలో 95 వేల కుటుంబాలు ఉండగా 86 వేల కుటుంబాలను కలుసుకోగా 76 వేల కుటుంబాలు తమ యొక్క మద్దతును వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి తెలిపారని ఇది ఓర్చుకోలేని ప్రతిపక్ష నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రతిపక్ష నాయకుల పై ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు ప్రజా మద్దతు ఉన్నప్పుడు ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడం తప్పుడు మాటలు చెప్పడం అనుభవం ఉన్న రాజకీయ నాయకునికి మంచిది కాదని తెలుగుదేశం పార్టీలో అజెండా లేక ప్రజలను మభ్యపెడుతున్నారని తండ్రితో ఒక బాట కొడుకుది ఒక బాటగా నడుస్తున్నారని తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు అగమ్య గోచరంగా ఉన్నారని ఆయన తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరల ముఖ్యమంత్రి కావాలని ప్రజల యొక్క ఆశీస్సులు 80% వరకు ప్రజా మద్దతు ఉన్నందున ఆయన అధికారంలో ఉంటేనే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగతాయని అలాగే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి మరియు ఇతర పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చి మరింత రాష్ట్రము అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్ముతున్నారని ప్రజల యొక్క నమ్మకాన్ని సర్వేలో వెళ్లడైందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ ఉమర్ ఫరూక్, వైస్ చైర్మన్ సునీల్, కన్వీనర్లు బాబు, నరసింహ, మండల వైస్ ఎంపీపీ రామాంజనేయులు, అగ్రి చైర్మన్ కొండల రాయుడు, సమరసింహారెడ్డి ,గోపాల్ రెడ్డి, శ్యామ్ నాయక్, రాము, రఘునాథ్ రెడ్డి, నారాయణ, ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img