Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జగనన్న స్థలాలు కూడా కబ్జాలు స్వామి…?

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలో 1,లక్ష 50 వేల మంది విస్థీరణం ప్రాంతంలో ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి ఒక్కరికి నివాస స్థలం కల్పించి నిర్మాణాలకు రుణం కూడా అందిస్తున్న సమయంలో జగనన్న ఇళ్ల స్థలం పొందిన లబ్ధిదారుల స్థలాలను కూడా కబ్జాలకు పాల్పడుతున్నట్లు బాధితులు మొరపెట్టుకున్నారు అయితే ఏకంగా ఎవరికి సమాచారం ఇవ్వకుండా బేస్ మట్టాలు కూడా వేసి దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి దృష్టికి బాదితులు తెలపడంతో ఎమ్మెల్యే స్పందించి జగనన్న పట్టాలు పొందిన స్థలాల్లోకి కబ్జాదారులు ఎవరైనా చొరబడి నట్లు తెలిస్తే సంబదిత వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. వైఎస్ఆర్సిపి మాజీ కౌన్సిలర్ రంగన్న మాట్లాడుతూ పట్టణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మున్సిపాలిటీ లేఔట్ గా మార్చి ఎంతో ప్రాణాలిక రూపొందించి ఇల్లు లేని ప్రతి ఒక్క పేద ప్రజలకు నివాస స్థలాలు అందించేందుకు జగనన్న కాలనీగా శ్రీకారం చుట్టాడని అయితే కొంతమంది అక్రమంగా జగనన్న ఇచ్చిన స్థలాలలో దౌర్జనంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మున్సిపాలిటీ కమిషనర్ పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలకు సచివాలయంలో నమోదు చేసుకున్న అర్హత ఉన్న అందరికీ పట్టాలు పంపిణీ చేయడం జరిగింది.అయితే అర్హత ఉన్న లబ్ధిదారుల స్థలాలను అక్రమంగా కబ్జాలకు పాల్పడుతున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. పట్టణంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్న జగనన్న ఇచ్చిన స్థలాలను కాపాడాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img