Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జగన్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత

విశాలాంధ్ర -ఉరవకొండ: జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బడుగు, బలహీన మైనార్టీ వర్గాలకు, పెద్దపీట వేయడం ద్వారా ఆ వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్నాడని అధిక శాతం వెనకబడిన వర్గాలను శాసన మండలికి ఎంపిక చేసి సామాజిక, రాజకీయ విప్లవానికి నాంది పలికారని ఉరవకొండ వైస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు అన్నారు. గురువారం ఉరవకొండ లో ఎంపీపీ చందా చంద్రమ్మ, వైస్ ఎంపీపీ నరసింహులు, సర్పంచ్ లలిత, ఆమిద్యాల పిఏసీఎస్ చైర్మన్ తేజోనాత్,రాష్ట్ర డైరెక్టర్లు గోవిందు, జోగి వెంకటేష్, టౌన్ బ్యాంక్ అధ్యక్షులు సాదు కుల్లాయి స్వామి,జిల్లా వక్ఫ్ బోర్డు మెంబర్ మీరం బాషా, పార్టీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు బసవరాజు తదితరులు విలేకరులతో మాట్లాడుతూ శాసనమండలిలో 18 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 14 స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించి 68 శాతం పదవులు ఇచ్చారని అలాగే రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విదంగా 70 శాతం మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించి సామాజిక విప్ల‌వానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ నాంది పలికారన్నారు.ఇటు సంక్షేమ పథకాలు అమలులోగానీ, అటు రాజకీయ పదవుల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విదంగా ప్రాధాన్యతనిస్తూ ఈ వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కృషి చేస్తున్నారన్నారు. అన్ని వర్గాలకు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించి రుణం తీర్చుకోవాలని అన్నారు. నియోజకవర్గంలో కూడా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి వెనుకబడిన వర్గాల వారికి అధిక ప్రాధాన్తిస్తున్నారని ఆయన యొక్క సహకారంతో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులుగా సిపి వీరన్న, పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షులుగా బసవరాజును రాష్ట్ర పార్టీ నియమించడం జరిగిందన్నారు. కొత్తగా నియామకాలు అయిన వారిద్దరికీ అభినందనలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img