Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జగన్‌ వైఫల్యాలపై దశల వారి పోరాటాలు

సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ పిలుపు
విశాలాంధ్ర-కళ్యాణదుర్గం :
మాట తప్పను, మడమ తిప్పను నినాదంతో మూడున్నరేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పేద, దళిత , బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల లక్ష్యంగా దాడులు చేస్తూ తన వైఫల్యాలను చాటుకుంటున్నాడని సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ ఆరోపించారు. కళ్యాణదుర్గం లో బుధవారం సిపిఐ తాలూకా కార్యవర్గ సమావేశం వై. గోపాల్‌ అధ్యక్షతన జరగగా ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి జాఫర్‌, సహాయ కార్యదర్శి నారాయణస్వామి , జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవప్ప, నియోజకవర్గం కార్యదర్శి గోపాల్‌, హాజరయ్యారు. ఈ సందర్భంగా జాఫర్‌ మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి పరిపాలన వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్‌ జిల్లాలో రమీజా అనే మైనార్టీ మహిళ పింఛన్‌ అడిగిన పాపానికి దాడి చేసి కాళ్లతో తన్ని%శీ%చ్చాడని గుర్తు చేశారు. కందుకూరు , గుంటూరు నగరాల్లో చంద్రబాబు పర్యటన లో పోలీసుల వైపల్యాన్ని చాటి చెబుతూ అక్కడ ప్రమాదాలు జరిగాయని దీన్ని అలుసుగా తీసుకొని బ్రిటిష్‌ నాటి చట్టాలను తెరపైకి తెచ్చి రాష్ట్రంలో ప్రతిపక్షాలు ర్యాలీలు సమావేశాలు పెట్టకూడదంటూ చీకటి జీవో నెంబర్‌ వన్‌ తెచ్చాడని ముఖ్యమంత్రి పై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్న ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జీవో నెంబర్‌ 1 పై హైకోర్టులో అప్పీల్‌ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై భారత కమ్యూనిస్టు పార్టీ రెండు నెలల పాటు దశల వారి పోరాటాలు నిర్వహిస్తున్నట్లు జాఫర్‌, నారాయణ స్వామిలు వెల్లడిరచారు.. ఇందులో భాగంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం మంజూరు చేసిన నిర్మాణాలు , జగనన్న కాలనీలో మౌలిక వసతులపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.. జగనన్న కాలనీల పేరుతో 30 లక్షల మందికి ఒక సెంటు, ఒకటిన్నర సెంటు స్థలాలు ఇచ్చి ఏ మూలకు సరిపడకుండా ఇళ్ల నిర్మాణం జరగకుండా చేసిన జగన్మోహన్‌ రెడ్డి ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నించారు. మూడున్నరేళ్లలో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయకుండా చాలీచాలని నిధులతో పేదలకు మరింత భారాన్ని మోపినాడని ఆరోపించారు. పేదలకు ఇచ్చిన స్థలాలను అమ్ముకునే దుస్థితికి తెచ్చాడని దుయ్యబట్టారు.. పక్కా ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు లబ్ధిదారునికి అందించి ,, సిమెంటు ఇసుకను కూడా ఫ్రీగా అందివ్వాలని డిమాండ్‌ చేశారు.. జనవరి 10 , 20 తేదీల మధ్య టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు జగనన్న కాలనీలోని లబ్ధిదారులతో సిపిఐ కార్యకర్తలు నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం చేస్తామన్నారు.. ఈనెల 30న రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఫిబ్రవరి 6న లబ్ధిదారులతో సదస్సులు నిర్వహించి కలెక్టర్లకు అర్జీలు ఇప్పిస్తామన్నారు . ఫిబ్రవరి 2న విజయవాడలో మహా ధర్నా చేస్తామని ప్రకటించారు . గత ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డి ప్రత్యేక హోదా అంశంపై ఊకుదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు.. ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాయితీతో కూడిన పథకాలు అమలు అవుతాయని ఫలితంగా నిరుద్యోగం తీరుతుందని గుర్తు చేశారు . విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకానికి జగన్‌ ప్రభుత్వం మద్దతు పలకడంపై మండిపడ్డారు.. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్షాలపై దాడులు చేయడం తప్ప అభివృద్ధి సూన్యమన్నారు . కేంద్రం దగ్గర మోడీ అమిత్‌ షా వద్ద మోకరిల్లడం జగన్‌ కు పరిపాటిగా మారిందని మండిపడ్డారు.. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జనవరి 20 నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జగన్‌ వైఫల్యాలపై బస్సు యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో యువత విరివిగా పాల్గొనాలని కోరారు. 32 మంది బలిదానాలు చేస్తే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు అయిందని గనులు ఖనిజాలు లేకపోయినా వేల కోట్ల రూపాయలు లాభాలు అర్ధిస్తున్న స్టీల్‌ ప్లాంట్‌ ను కేవలం 20వేల కోట్లకు ఆదానికి అమ్మ చూపుతున్న కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాలు కొనసాగిస్తామని గుర్తు చేశారు . విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐటియుసి గత రెండేళ్లుగా ఉద్యమం చేపడుతుందని జనవరి 27న మహా గర్జన చేస్తున్నామన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పార్టీని విస్తరించడానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నాయకులు వెల్లడిరచారు కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మహదేవ్‌, నాయకులు నరసింహులు, నాగరాజు నాయక్‌ , హరిదాసు, ఓంకార్‌ , ఆంజనేయులు, ఆస్వర్థ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img