Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జాతీయ అవార్డులు పొందిన నిమ్మలకుంట తోలుబొమ్మ కళాకారులు

విశాలాంధ్ర`ధర్మవరం : భారతీయ కళ్లలో తోలుబొమ్మ కళాకారులు జాతీయ అవార్డును పొందడం జరిగింది. శ్రీ సత్య సాయి జిల్లా నిమ్మలకుంట గ్రామములోని తోలుబొమ్మల కళాకారులైన దళవాయి కుళ్లాయప్ప, ధళ్ల్‌ వాయి లక్ష్మమ్మ లకు హస్తకళల విభాగములో జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నారు.. వివరాలకు వెళితే దేశ రాజధాని అయిన ఢల్లీిలో విజ్ఞాన్‌ భవన్‌ లో సోమవారం జరిగిన హస్త కలల ప్రదర్శన,అక్కడి వారిని అందరిని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగానే ఓకే గ్రామానికి చెందిన తల్లి కొడుకులకు ఈ అవార్డులు లభించడం పట్ల అందరూ అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లి దలవాయి లక్ష్మమ్మ, కుమారుడు, దలవాయి కుళ్లాయప్పలు కేంద్ర జౌళి శాఖ మంత్రి పియూస్‌ గోయల్‌, ఉపరాష్ట్రపతి జగదీష్‌ ధన ఖడ్‌ చేతుల మీదుగా అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. 2017 సంవత్సరానికి గాను ఉత్తమ జాతీయ అవార్డు కుమారునికి రాగా, 2019 వ సంవత్సరంలో ఉత్తమ జాతీయ అవార్డుకు గాను తల్లికి రావడం విశేషం. అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ ఈ జాతీయ అవార్డు పొందడం మాకెంతో సంతోషంగా ఉందని, కళాకారులను కేంద్ర ప్రభుత్వం మరింతగా ఆదుకునే విధంగా, జీవన విధాన ప్రమాణమును పెంచాలని వారు కోరారు. దేశ రాజధానిలో శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం, నిమ్మలకుంట గ్రామాన్ని ఖ్యాతి తెచ్చినందుకు పలువురు ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img