Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

” జాతీయ డెంగూ దినోత్సవం “

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ” వారి అధ్యక్షతన,జిల్లా మలేరియా అధికారి అధ్వర్యమున నిర్వహించడం జరిగినది. ఈ మీటింగు నందు డెంగీ వ్యాధి లక్షణాలు,చికిత్స,తీసుకొవలసిన జాగ్రత్తలు,నివారణ చర్యలు మొ..విషయముల గురించి చెప్పడమయెనడి.ఈ కర్యక్రమము మునిసిపల్ సమావేశ హాల్ నందు జరిగినది. ఈ సమావేశంనకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వీరబ్బాయి,జిల్లా మలేరియా అధికారి ఓబులు,మునిసిపల్ కమిషనర్ , ప్రాజెక్టు డైరెక్టర్ మునిసిపల్ ప్రజారోగ్య అధికారి , అసిస్టెంట్ మలేరియా అధికారి, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, వార్డ్ ఆరోగ్య కార్యదర్సులు వార్డ్ శానిటేషన్ కార్యదర్సులు హాజరైనారు.
ఈ సమావేశంలో జిల్లా మలేరియా అధికారి కీటక జనిత వ్యాధుల గురించి తెలిపారు.దోమల వలన మలేరియా, డెంగీ. చీకున్ గున్య, బోధవ్యాధి, మెదడువాపు వ్యాదు ల వస్తాయని, దోమ జీవిత చరిత్ర గురించి, దోమలు వృద్ధిచెందే ప్రదేశాల గురించి తెలిజేస్తూ దోమల పెరుగుదలను అరికట్టడానికి మనమందరము కృషి చేయాలని తెలిపారు. సహాయ మలేరియా అధికారి కే. సత్యనారాయణ దోమల నివారణ చర్యల గురించి వివరించారు. పరిసరాలు,కాలువలు శుభ్రంగా ఉంచాలని మునిసిపల్ శాఖలకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా మలేరియా కార్యాలయం సిబ్బంది ఏ ఎం ఒ సత్యనారాయణ, ఎం పి హెచ్ ఈ ఒ లు గిరిధర్ రెడ్డి, మద్దయ్య, సూపెర్వైసోర్స్ నూర్ బాష, శేఖర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img