Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జిజిహెచ్‌లో చిన్నారులకు కంటి రెటీనా పరీక్షలు

విశాలాంధ్ర ` అనంతపురం వైద్యం : ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి త్వరిత చికిత్స కేంద్రము లో గురువారం రాష్ట్రీయ బాల స్వస్థ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా కార్యక్రమ జిల్లా పర్యవేక్షణ అధికారి డాక్టర్‌ నారాయణస్వామి ఆధ్వర్యంలో గౌతమి ఐ ఇన్స్టిట్యూట్‌ రాజమండ్రి ట్రస్ట్‌ వారి సహకారంతో బరువు తక్కువగా పుట్టిన, నెలలు నిండక పుట్టిన పిల్లలు, మరియు గుండె లోపం, రక్తహీనత ఇతర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలను సమీకరించి వారికి కంటి రెటీనా పరీక్షలను ‘రెడ్‌ కామ్‌’ అనే పరికరంతో స్క్రీన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 22 మంది పిల్లలను పరీక్షించగా ,అందులో 11 మంది పిల్లలకు సమస్య ఉన్నట్టు గుర్తించారు. వీరిని మరల రెండు వారాల తర్వాత పరీక్షించి రెటీనా మెచ్యూరిటీ పొందకపోతే వీరికి ఉచితంగా డాక్టర్‌ ఎల్‌ వి ప్రసాద్‌ ఐ హాస్పిటల్‌ ,హైదరాబాద్‌ కు పంపి చికిత్స చేయించబడును. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లల వైద్య నిపణురాలు డా. శ్రీవిద్య, కంటి పరీక్షా నిపుణురాలు జ్ఞాన ప్రసన్న, మేనేజర్‌ రజిత, స్టాఫ్‌ నర్స్‌ సుష్మా, దివ్య, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img