Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జీవో నెంబర్ 01పై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ లోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రాధమిక హక్కులను, రాజ్యాంగ భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేందుకు రాష్ట్ర ప్రభుత్వము తీసుకొని వచ్చిన జివో నెంబర్ 1 హైకోర్టుకొట్టివేత ప్రజాస్వామ్య శక్తుల విజయం ఈ జీవో నెంబర్ ప్రజాస్వామ్యబద్ధంగా లేదని నిరంకుశత్వం పాలనకు ప్రజాస్వామ్యంలో హిట్లర్, ముసోలియన్ వంటి నియంత పాలనకు అద్దం పట్టే విధంగా ఉందని ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని ఉద్దేశంతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వేసిన పిటీషన్ను శుక్రవారం రాష్ట్ర హైకోర్టు కొట్టి వేసిందని దీనివల్ల ప్రజాస్వామ్యతంగా రాష్ట్రంలో సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చు అని ప్రశాంతంగా నిరసన తెలిపే హక్కు ప్రజలకు ప్రతిపక్షాలకు ఉందనే ఉద్దేశంతో ఉద్యమాలు చేయడం ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే విధంగా ఉద్యమాలు చేసిన నిబంధనలు ఉండకూడదు అనే ఉద్దేశంతో సిపిఐ రామకృష్ణ వేసిన పిటిషన్ను పూర్తిగా విచారణ చేసిన అనంతరం కొట్టి వేయడం శుభపరిణామం అని ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టు విధంగా ఉందని ఆమె తెలిపారు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా కళ్ళు తెరవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పరిపాలనకు ఇటువంటి జీవోలు వాదం పడతాయని అధికారులు కూడా ప్రజాస్వామ్యాన్ని మరచి పాలకులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవడం ప్రజాస్వామానికి విఘాతం కలిగే విధంగా జీవోలు తేవడం మంచిది కాదని ప్రభుత్వము పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని పాదయాత్రలకు ర్యాలీలకు సభలకు ఆటంకం కలిగించడం సరికాదని ప్రతి చిన్న విషయానికి కలగజేసుకొని కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదని ఆమె తెలిపారు
ఈ కార్యక్రమంలో మాధవ నాయుడు, శ్రీరాములు,మాజీ సర్పంచ్ ప్రసాద్, త్రివేంద్ర నాయుడు ,మావుటూరు గోపాల్ ,బాబుల్ రెడ్డి,మారుతి వాసుదేవరెడ్డి, షాలు బాషా,,సనావుల్లా,నిసార్,ఫయాజ్ రమేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img