Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జ్యోతిరావు పూలే ఆలోచనలు సజీవమైనవి.. మున్సిపల్‌ చైర్మన్‌ లింగం నిర్మల

విశాలాంధ్ర`ధర్మవరం : జ్యోతిరావు పూలే ఆలోచనలు సజీవ మైనవని,మహిళా విముక్తి, విద్యావ్యాప్తి కోసం కృషిచేసిన సామాజిక ఉద్యమకారుడు జ్యోతి రావు పూలే అని మున్సిపల్‌ చైర్మన్‌ లింగం నిర్మల తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక ప్రెస్‌ క్లబ్‌ బ్‌ లో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా చేతి వృత్తిదారుల సమైక్య ఆధ్వర్యంలో సెమినార్‌ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్‌ చైర్మన్‌ లింగం నిర్మల విచ్చేశారు. తొలుత జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజ అసమాన తల నిర్మూలనలకు వారి ఆలోచనలే మార్గమని, సమాజములో జ్ఞానం పెరిగే కొద్దీ అసమానతల తీవ్రత తగ్గుతుందని తెలిపారు. స్త్రీ పక్షపాతిగా ఉంటూ అనేక సంఘసంస్కరణలు ప్రతిపాదించి సాధించడం జరిగిందన్నారు. అనంతరం చేతివృత్తుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జింక చలపతి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే, అంబేద్కర్‌ ఆలోచనలకు దగ్గర పోలికలు ఉన్నాయని తెలిపారు. ఇటువంటి ఆలోచనలు సమాజానికి ఎంతో అవసరమని, రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు లభించినా ,వాటిలో అమలుపరిచే వ్యవస్థ ఆధిపత్య వర్గాల చేతిలో ఉండడం వలన, రిజర్వేషన్‌ ద్వారా పదవులు వచ్చిన పవర్‌ లభించకపోవడంతో సామాజిక అంతరం అలాగే ఉండిపోతోందని తెలిపారు. దానిని సాధించడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై దాడులు కొనసాగడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ హెడ్మాస్టర్‌ యజ్జన్న ప్రముఖ న్యాయవాదులు, మైనారిటీ నాయకులు అతావుల్లా, చేనేత సంఘ కార్యదర్శి వెంకటనారాయణ, చేనేత నాయకులు ఉడుముల రామచంద్ర, ఆర్టీసీ యూనియన్‌ నాయకులు లక్ష్మన్న, పూజారి నర్సింలు, ఎన్‌ ఎస్‌ యు ఐ నాయకులు ప్రసాద్‌, బోయ రవి, గుర్రం వెంకటస్వామి, చెన్నంపల్లి శ్రీనివాసులు, శ్రీధర్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు కేశగాల వెంకటేష్‌, బాలకృష్ణ, కాటమయ్య, కుల్లా ఎప్ప, రవి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img