Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

టీచర్స్ ఎమ్మెల్సీగా కత్తి నరసింహారెడ్డి కి ఎమ్మెల్సీగా పోతుల నాగరాజుకు మద్దతుగా సీపీఐ ప్రచారం…

విశాలాంధ్ర-గుంతకల్లు : పశ్చిమ రాయలసీమ పట్టబద్దుల ఎస్ టి యు ,యుటిఎఫ్ ,పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీచర్స్ ఎమ్మెల్సీగా కత్తి నరసింహారెడ్డి కి ఎమ్మెల్సీగా పోతుల నాగరాజుకు మద్దతుగా సీపీఐ ప్రచారం చేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం అభ్యర్థించారు,పట్టణంలో ఆర్ టి సి బస్టాండ్ లో సీపీఐ నాయకులు వివిధ గ్రామాలకు వెళ్ళు టీచర్స్ ని ఓటు వేసి వేయించి కత్తి నరసింహారెడ్డిని ,పోతలు నాగరాజు ని అధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ ప్రచారానికి ముఖ్య అథితులు ఏఐటీయూసీ మాజీ మండల కార్యదర్శి ఎస్ గోపీనాథ్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ ఉపాధ్యాయ హక్కుల కోసం కాంటాక్ట్ ఉద్యోగుల రెగ్యులర్ చేయడం కోసం ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నిరంతరం పోరాడుతున్న కత్తి నరసింహారెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాలని సామాజిక కార్యకర్త పోతుల నాగరాజు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ రెండో కూడా ప్రజా సమస్య పరిష్కారంలో విఫలం మయ్యాయి అన్నారు. నిత్యం ప్రజా సమస్యల పైన పోరాడుతున్న కార్మిక సంఘాలు కాత్తి నరసింహారెడ్డికి పోతుల నాగరాజు కి మద్దతుగా నిలిచాయని అన్నారు. నిరుద్యోగ యువత మేధావులు ఆలోచన చేసి నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్సీలకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి వెంకట నాయక్, ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ ఆర్గనైజేషన్ కార్యదర్శి వినోద్,డిహెచ్ పి ఎస్ నాయకులు మల్లయ్య, ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి చంద్ర ,పట్టణ నాయకులు రాజ్ కుమార్ ,శిక్షావలి, శివమణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img