Friday, April 19, 2024
Friday, April 19, 2024

డిపో ఆదాయ అభివృద్ధికి ప్రజలు సహకారం ఎంతో అవసరం… మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు

విశాలాంధ్ర – ధర్మవరం : ధర్మవరం ఆర్టీసీ డిపో ఆదాయ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల, వైస్ చైర్మన్లు పెనుజూరు నాగరాజు, భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆర్టిసి డిపోలో పులివెందులకు.. రెండు బస్సులు, అనంతపురం కు ఒక టి, మొత్తం మూడు నూతన బస్సులకు చైర్మన్, వైస్ చైర్మన్ లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం దూర ప్రాంతాలకు కూడా బస్సుల ఏర్పాటు, రిజర్వేషన్ సౌకర్యం కూడా కలదని తెలిపారు. అదేవిధంగా విజయవాడకు, బెంగళూరుకు బస్సులు నడపాలని, ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ,ధర్మవరం నుండి అధికంగా ప్రయాణిస్తున్నందున, తొందరగా ఈ రెండు ఊర్లకు బస్సులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిపో మేనేజర్ కు సూచించారు. అనంతరం డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్, అధికారులు, సిబ్బంది చైర్మన్, వైస్ చైర్మన్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చందమూరి నారాయణరెడ్డి,మాసపల్లి సాయికుమార్, రాయపాటి రామకృష్ణ, గోరకాటి పురుషోత్తం రెడ్డి, జెసిబి రమణ, వైఎస్ఆర్సిపి నాయకులు కత్తె పెద్దన్న, ఎస్పీ బాషా, మాజీ కౌన్సిలర్ ఉడుముల రామచంద్ర, ఆర్టీసీ ఉద్యోగులు ప్రేమ్ కుమార్, ఓబులేసు, మధు, గోపాల్ సివిఆర్ రెడ్డి, సుమోసిన, నాగార్జున రెడ్డి, ముస్తఫా, ఎస్. బాబు, రామకృష్ణ, నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img