Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

త్రాగునీటి సమస్య పరిష్కారానికి రూ,65.94 కోట్లు మంజూరు

ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి
విశాలాంధ్ర – ఉరవకొండ :
ఉరవకొండ నియోజక వర్గములో త్రాగునీటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వము దాదాపు రు. 65.94 కోట్ల రుపాయల నిధులు విడుదల చేసిందని యం.యల్‌.సి వై. శివరామిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజక వర్గములోని ఉరవకొండ, వజ్రకరూరు, కూడేరు, విడపనకల్‌, బెలుగుప్ప మండలాల లోని గ్రామాలలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముఖ్యమంత్రి వై.యస్‌. జగన్మోహన్‌ రెడ్డి నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. తాగునీటి సమస్యపై ముఖ్యమంత్రి కి మరియు ఇ.యన్‌.సి దృష్టికి తాను స్వయంగా తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి దాదాపు రూ.7668.25 కోట్ల రుపాయలతో పనులు చేపడుచున్నారని అందుకు సంబందించిన ప్రభుత్వ ఉత్తర్వులు నెం.918, తేది. 21.11.2022 నాడు విడుదల చేశారని తెలిపారు. ఆ నిదులలో ఉరవకొండ నియోజక వర్గములో తాను కోరిన ప్రతి త్రాగునీటి పనులకు ఆమోదము తెలిపారని అందుకు ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దాదాపు ఉరవకొండ నియోజక వర్గములో రు. 65.94 కోట్ల రుపాయలతో దాదాపు 135 పనులకు ఆమోద ముద్ర లభించిందని తెలిపారు. ఉరవకొండ నియోజకవర్గములోని అన్ని మండలాలో త్రాగునీటి ఎద్దడి నివారించడానికి శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకున్నామని ఈ సంధర్బంగా యం.యల్‌.సి వై. శివరామిరెడ్డి తెలియజేశారు. అంతేకాకుండా ఈ నిదులలో జె.జె.యమ్‌ పధకము క్రింద ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు పనులు చేపడుతున్నామన్నారు. ఈ సంధర్బంగా ఉరవకొండ ఆర్‌.డబ్ల్యు.యస్‌. డి.ఈ అంజుమన్‌ సఫ్రీన్‌ వజ్రకరూరు ఆర్‌.డబ్ల్యు.యస్‌., ఎ.ఈ దాక్షాయణి యం.యల్‌.సి ని కలసి మంజూరు కాబడిన పనులగురించి చర్చించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img