Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దొంగతనం కేసుల్లో రికవరీ సత్వరంగా చేయండి.. డి.ఎస్.పి. శ్రీనివాసులు

విశాలాంధ్ర -ధర్మవరం : దొంగతనం కేసుల్లో సత్వరమే రికవరీ చేసేలా చర్యలు చేపట్టాలని నూతన డిఎస్పి.. శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను వారు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తదుపరి స్టేషన్లో ఉన్నటువంటి పలు రికార్డులను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసులు ఎన్ని? పూర్తి అయిన కేసులు ఎన్ని? తదితర కారణాలను సీఐ సుబ్రహ్మణ్యం ద్వారా అడిగి తెలుసుకున్నారు. నేర విచారణలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెండింగ్ ఉండరాదని వారు సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి గౌరవంగా పలకరిస్తూ, వారి సమస్యలపై చక్కటి స్పందన ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. చాటింగు, సైబర్ క్రైమ్, బాల్యవివాహాలు, వివిధ చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పట్టణంలో ఎక్కడ కూడా పేకాట, జూదం, అసాంఘిక కార్యకలాపాలు ఉండకుండా చూడాలని తెలిపారు. సచివాలయములోని మహిళా పోలీసుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకొని, వారితో సమావేశాలను నిర్వహించి, శాంతి భద్రతలను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సమన్వయంతో అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం చేసినప్పుడే, పోలీస్ స్టేషన్కు మంచి గుర్తింపు రాగలదని వారు సూచించారు. నైట్ బీట్ ల విషయంలో ప్రత్యేక శ్రద్ధను కనపరిచి దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. కళాశాలలో ర్యాగింగ్ జరగకుండా మున్ముందు విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహించాలని సూచించారు. పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ సిబ్బందిచే చేయించాలని వారు తెలిపారు. ఎండాకాలమును దృష్టిలో ఉంచుకొని కూడా పోలీసులు తమ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img