Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత

విశాలాంధ్ర`ఉరవకొండ : ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేసి మానసిక ప్రశాంతతను పొందాలని కోరుతూ శనివారం ఉరవకొండ పట్టణంలో పిరమిడ్‌ ధ్యాన కేంద్రాల సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఉరవకొండ పట్టణంలో లోబ్‌ సాంగ్‌ రాంపా పిరమిడ్‌ ధ్యాన కేంద్రం 29వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ మాంసాహారానికి దూరంగా ఉండాలని శాఖాహారమే మానవహారం అని ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తమ నివేదికలలో 159 రకాల ప్రాణాంతక రోగాలకు కేవలం మాంసాహారమే కారణమని చెప్పడం జరిగిందన్నారు. శాఖాహారమే శరీరానికి అసలైన అమృత ఆహారం అని ప్రతి ఒక్కరు కూడా దీనిని పాటించాలన్నారు. ధ్యానం చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని శారీరిక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, బుద్ధి కుశలత, ఏకాగ్రత,జ్ఞాపకశక్తి, సూక్ష్మ శరీర యానం, ఆత్మవిశ్వాసం, తదితర ఎన్నో ఉపయోగకర అంశాలు ధ్యానం వల్ల కలుగుతాయన్నారు వీటన్నింటిని కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఇలాంటి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం, బళ్లారి తదితర ప్రాంతాలకు చెందిన ధ్యాన కేంద్రాల సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img