Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నారాయణ పాఠశాలను సీజ్‌ చేయాలి – ఎఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ

విశాలాంధ్ర`బ్రహ్మసముద్రం : నకిలీ సర్టిఫికెట్లతో నారాయణ పాఠశాల ను నడుపుతున్నారని ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణదుర్గం పట్టణంలో స్దానిక ఉమా నగర్‌ లో వున్న నారాయణ పాఠశాలకు అనుమతులు లేవని యాజమాన్యం నకిలీ పత్రాలతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తున్న పాఠశాలను సీజ్‌ చేయాలన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు హనుమంతరాయుడు,, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ, మాట్లాడుతూ నారాయణ పాఠశాల అనుమతులేకున్న 8,9,10 తరగతులు నిర్వహిస్తున్నారు.ఇదేంటనీ గతంలో అడిగితే నకిలీ పత్రాలను చూపుతూ కాలయాపన చేస్తున్నారు.విద్యాశాఖ అధికారులు ఇప్పటి వరకు పాఠశాలకు వున్న అనుమతి పత్రాలను చూసి పాఠశాలను వెంటనే సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.పాఠశాలో చదువుకున్న 8,9,10 విద్యార్థులను అధికారులు వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అక్కడ చదువుతున్న విద్యార్థులకు మరో పాఠశాలకు మార్చాలని కోరారు.లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ పట్టణ ఉపాధ్యక్షులు క్రాంతి ,అక్షిత్‌, సిద్ధార్థ, కంబదూరు మండల కార్యదర్శి సాయి, ఏఐఎస్‌ఎఫ్‌ పట్టణ నాయకులు ఓం ప్రకాష్‌ ,రుద్రేశ్‌ ,చంద్రశేఖర్‌, ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అరవింద్‌ ,దినేష్‌,హర్ష, తదితలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img