Friday, April 26, 2024
Friday, April 26, 2024

నిజాయితీని చాటుకున్న ధర్మవరం ఆర్పిఎఫ్ పోలీసులు

విశాలాంధ్ర-ధర్మవరం : ఓ రైలులో అఖిలతోపాటు కుటుంబ సభ్యులు పోగొట్టుకున్న వస్తువులను, బంగారమును, లాప్టాప్ ను రైల్లో మరచిపోయీ, వచ్చిన ఫిర్యాదు మేరకు ధర్మవరం ఆర్ పి ఎఫ్ పోలీసులు చేదించి, తదుపరి కుటుంబ సభ్యులకు వాటిని అందజేసి, తమ నిజాయితీని నిరూపించుకున్నారు. తదుపరి ఆర్పిఎఫ్ సీఐ బోయ కుమార్ మంగళవారం మాట్లాడుతూ సోమవారం తెల్లవారుజామున 5 గంటల 40 నిమిషాలకు కాచిగూడ నుంచి బెంగళూరుకు వెళుతున్నటువంటి రైలులో అఖిల కుటుంబ సభ్యులతో పాటు అనంతపురం వరకు ప్రయాణించిందనీ, అనంతపురం స్టేషన్ చేరుకోగానే వారి వస్తువులతో పాటు ఇంటికి వెళ్లారని తెలిపారు. ఇంట్లో తన వస్తువులలో ఒకటైన బ్యాగును మరిచిపోయానని తెలుసుకొని ఆ సమాచారాన్ని ఆర్పిఎఫ్ టోల్ ఫ్రీ నెంబర్ 139 కు ఫోన్ చేసి ఫిర్యాదును అందజేశారు అని తెలిపారు. ఆ ఫిర్యాదులో తన బ్యాగు కాచిగూడ- యలహంక రైలులో మిస్ అయ్యిందని తెలపడం జరిగిందన్నారు. ఈ సమాచారాన్ని ఆర్పిఎఫ్ సెక్యూరిటీ కంట్రోల్ వారు ధర్మవరం ఆర్పిఎఫ్ వారికి వెనువెంటనే సమాచారాన్ని అందజేశారు. అక్కడే విధులలో ఉన్న ఇన్స్పెక్టర్ తక్షణమే స్పందించి, రైల్వే విధులు నిర్వర్తిస్తున్నటువంటి ట్రైన్ ఎస్కార్ట్ స్టాఫ్ ను అలర్ట్ చేసి వెతికించడం జరిగిందన్నారు. ట్రైన్ ఎస్కార్ట్ స్టాప్ వారికి ఎస్-6 కోచ్ లో ఆ బ్యాగు దొరకడం జరిగిందన్నారు. అనంతరం సమాచారాన్ని సెక్యూరిటీ కంట్రోల్ కి తెలియజేయగా అఖిలతోపాటు వారి కుటుంబ సభ్యులు మంగళవారం ధర్మవరం ఆర్పిఎఫ్ కార్యాలయానికి చేరుకొని సీఐ సమక్షంలో కుటుంబ సభ్యులకు అందజేశా మన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆ బ్యాగును తెరిచి చూడగా అందులో తన పెళ్లి నిమిత్తం తెచ్చినటువంటి 12 తులాల బంగారం, 10 తులాల వెండి, ఒక లాప్టాప్ ఉందని వారు తెలిపారు. మొత్తం ఆ వస్తువుల యొక్క విలువ 7 లక్షల 50 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. తదుపరి కుటుంబ సభ్యులు ఆర్పిఎఫ్ సిఐకు వారి సిబ్బందికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img