Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నేటి నుండి ఇంటర్ జోన్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం

విశాలాంధ్ర-రాప్తాడు : అనంతపురం ఆర్డీటీ అనంత క్రీడాగ్రామంలో ఈనెల 11 నుండి 13వ వరకు ఇంటర్ జోన్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమవుతాయని ఏపీ సాఫ్టుబాల్ సీఈఓ సి.వెంకటేసులు శుక్రవారం తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ,ఈ క్రీడా పోటీలకు దేశంలోని సౌత్ జోన్, నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ ల నుండి నాలుగు పురుషుల, నాలుగు మహిళల జట్లు పాల్గొంటాయన్నారు. నేటి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, డిప్యూటీ కలెక్టర్, ఆన్సెట్ సీఈఓ కేశవ నాయుడు, ఆర్డీటీ ఛైర్మన్ తిప్పేస్వామి, సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ ప్రవీణ్ అనౌకర్, ట్రెజరర్ శ్రీకాంత్ తోరాట్, ఏపీ సాఫ్టుబాల్ అధ్యక్షుడు ఎన్.ఫణిభూషణ్, జిల్లా అధ్యక్షుడు సి.నాగేంద్ర హాజరవుతారన్నారు. సీఈఓ సి.వెంకటేశులు మాట్లాడుతూ ఈపోటీల్లో నాలుగు జోన్ల నుండి విజేతలైన నాలుగు పురుషుల, నాలుగు మహిళల జట్లు పాల్గొంటాయన్నారు. ఆర్డీటీలో అంతర్జాతీయ క్రీడా సదుపాయాలు ఉన్నందున సాఫ్ట్బాల్ ఇండియా వారు సాఫ్ట్బాల్ జాతీయ టోర్నమెంట్ లను మనకు ఇస్తున్నారన్నారు. దేశంలోని అత్యుత్తమమైన సాఫ్ట్బాల్ క్రీడాకారులు ఈ టోర్నమెంటులో పాల్గొంటారన్నారు. ఇలాంటి సదుపాయాలు కల్పించిన ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచూ ఫెర్రర్ కు ఏపీ సాఫ్ట్బాల్ అసోసియేషన్ రుణపడి ఉంటుందన్నారు. ఆర్డీటీతోపాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ సహకారం, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో ఏపీలో ఈక్రీడ దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. ఈ టోర్నమెంట్ కు 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు పాల్గొంటారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img