Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నేషనల్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ లో ఏపీ పురుషుల జట్టు ప్రభంజనం

విశాలాంధ్ర-రాప్తాడు : ఒరిస్సాలోని పూరి లో ఈనెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరిగిన 44వ సీనియర్ నేషనల్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఏపీ పురుషుల సాఫ్ట్ జట్టు ప్రభంజనం సృష్టించి
ప్రథమ స్థానం కైవసం చేసుకుని నూతన అధ్యాయానికి తెరలేపింది. మొట్టమొదటిసారిగా సీనియర్ నేషనల్ సాఫ్ట్ బాల్ చరిత్రలో ఏపీ పురుషుల జట్టు ప్రథమ స్థానం సాధించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాఫ్ట్ బాల్ సంఘ సీఈఓ సి.వెంకటేశులు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్. శశిభూషణ్, సి.నాగేంద్ర హర్షం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో అంచలంచలుగా ఎదిగి జాతీయస్థాయిలో ఉన్నత స్థాయిలో నిలవడానికి సహకారం అందించిన ఆర్డిటి సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచూ ఫెర్రర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సాప్ట్ బాల్ క్రీడా అభివృద్ధికి సహకారం అందిస్తున్న 13 జిల్లాల సాఫ్ట్ బాల్ సంఘ అధ్యక్ష కార్యదర్శులకు సైతం ప్రత్యేక అభినందనలు తెలిపారు. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన పురుషుల సాఫ్ట్ గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ లో ఏపీ జట్టు పంజాబ్ రాష్ట్ర పురుషుల జట్టుపై 2-1 తేడాతో విజయ దుందుభి మోగించింది. ఏపీ సాప్ట్ బాల్ క్రీడాకారులందరూ తమ చిరకాల స్వప్నమైన సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ లో ప్రథమ స్థానం కైవసం చేసుకోవడం పట్ల హర్షాతిరేకాలతో క్రీడాకారులకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఈ టోర్నమెంట్లో ప్రథమ స్థానం సాధించడంపై రాష్ట్ర సీఈఓ సి.వెంకటేశులు స్పందిస్తూ జాతీయ స్థాయి క్రీడల్లోనే ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ బాల్ క్రీడను ఉన్నత స్థానంలో నిలపడం చాలా ఆనందకరంగా ఉందని ఈ క్రీడాకారులు ఉన్నతిని సాధించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img