Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పంటలు నష్టపోయిన వారికి ఇన్పుట్ సబ్సిడీ

విశాలాంధ్ర-రాప్తాడు : వారం రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు త్వరలోనే ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని మంజూరు చేస్తుందని ఏపీ ఉద్యాన శాఖ కమీషనర్ ఎస్ఎస్ శ్రీధర్   ప్రకృతి విపత్తుల స్పెషల్ ఆఫీసర్  హోదాలో శనివారం అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పర్యటించారు. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామంలో గాలి వానకు దెబ్బతిన్న, నష్టపోయిన అరటి పంటల రైతులుతో మాట్లాడారు. ఏఒక్క రైతూ ఆందోళన చెందొద్దని, రబీ సీజన్ చివరికల్లా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటుందన్నారు. కమిషనర్ వెంట జిల్లా ఉద్యాన అధికారి నరసింహారావు, మైక్రో ఇరిగేషన్ జిల్లా అధికారి ఫిరోజ్ ఖాన్, ఉద్యాన శాఖ అధికారి రత్నకుమార్, వీహెచ్ఏ ప్రియలత, అగ్రి అడ్వైజరీ బోర్డు చైర్మన్ కేశవరెడ్డి ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img