Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పంట కోత ప్రయోగాలతో దిగుబడి అంచనా : సీపీఓ ప్రేమచంద్ర

విశాలాంధ్ర-రాప్తాడు : ఖరీఫ్‌ సీజన్లో సాగుచేసిన కంది పంటలు పంట కూత ప్రయోగాలు చేయడం వల్ల దిగుబడిని అంచనా వేయవచ్చని డిస్ట్రిక్‌ చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ ప్రేమచంద్ర తెలిపారు. మండలంలోని జి.కొత్తపల్లి గ్రామంలో మంగళవారం సీహెచ్‌ఓ పర్యవేక్షణలో కందిలో 10మీటర్లు ఐ10 మీటర్ల చతురస్రంలో కంది పంట కోత ప్రయోగం చేశారు. వారం రోజులు ఎండిన తరువాత, ఆ ఎండిన పంట యొక్క గింజలను తూకము వేస్తామన్నారు. కార్యక్రమంలో సహాయ గణాంక అధికారి ఎస్‌. క్రిష్ణానాయక్‌, రాప్తాడు ఏఎస్‌ఓ చెన్నకేశవరెడ్డి, ఎంపీఈఓ నలినాక్షి, రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ప్రతినిధి కె..మోహన్‌, రైతులు గ్రామస్తులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img