Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పంట రుణాలు రెన్యువల్స్ లో ఇబ్బందులు తొలగించాలి

ఎనుముల దొడ్డి బ్యాంకు ఎదుట సిపిఐ నిరసన

విశాలాంధ్ర- కళ్యాణదుర్గం : ఖరీఫ్ పంట రుణాల మంజూరు, రెన్యువ ల్స్ విషయంలో బ్యాంకర్లు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వం చొరవ తీసుకొని అన్నదాతలను ఆదుకోవాలని సిపిఐ, రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కుందుర్పి మండలం ఎనుములదొడ్డి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ వద్ద రైతులతో కలిసి. సీపీఐ, రైతు సంఘం నాయకులు నిరసన చేశారు. గత ఏడాది రైతులు తీసుకున్న పంట రుణాలను వడ్డీ మాత్రమే వసూలు చేసి రెన్యువల్ చేసేలా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక బ్యాంక్ మేనేజర్ దగ్గర ఇదే విషయమై వాదనకు దిగిన సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి మహదేవ్, వై గోపాల్, రైతు సంఘం తాలూకా అధ్యక్షుడు హరిదాసు కుందుర్పి మండల కార్యదర్శి శివలింగప్ప మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో పంటలు పండక రైతులు ఇబ్బందులు పాలవుతున్నారని ఈ సందర్భంలో పంట రుణాన్ని మొత్తం చెల్లించడానికి డబ్బులు అధిక వడ్డీలతో తేవాల్సి ఉంటుందన్నారు. కేవలం వడ్డీ మాత్రమే చెల్లించుకుని పంట రుణాలు రెన్యువల్ చేయాలని కోరారు . ఇదే విషయమై స్థానిక బ్యాంకు సిబ్బంది మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రెండు రోజుల్లో నిర్ణయం చెప్తామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు రవి, నాగరాజు, మంజునాథ్, తిప్పయ్య, శ్యామలమ్మ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img