Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పట్టణ సమస్యలు పరిష్కరించడమే మున్సిపల్ కార్యాలయ ధ్యేయం… చైర్మన్ లింగం నిర్మల

మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన లింగం నిర్మల
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని సమస్యలను పరిష్కరించడమే మున్సిపల్ కార్యాలయం యొక్క లక్ష్యము అని మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో కౌన్సిల్ సమావేశమును వారు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పలు సమస్యలను చైర్మన్ దృష్టికి కౌన్సిలర్లు తీసుకొని వచ్చారు. సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అజెండాలోని 46 అంశాలను చదివి వినిపించి, అనంతరం కౌన్సిలర్ల ద్వారా ఆమోదం పొందారు. ఇంతలోనే తన మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు లింగం నిర్మల కౌన్సిల్ హాల్లో ప్రకటిస్తూ, తన రాజీనామాను అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డికి అందజేశారు. కౌన్సిల్ సమావేశం అరగంటలోనే ముగిసింది. అనంతరం లింగం నిర్మల మాట్లాడుతూ తన రాజీనామా విషయంలో కేవలం వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే రాజీనామా చేశానని, ఇందులో ఎలాంటి ఒత్తడి లేదు అని వారు తెలిపారు. తిరిగి నూతన మున్సిపల్ చైర్మన్ ను ఎంపిక విషయమై ఈనెల 5వ తేదీన చర్చించేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ లు భాగ్యలక్ష్మి, పెనుజురి నాగరాజు, మున్సిపల్ మేనేజర్, ఆర్వో అధికారి..ఆనంద్, ఇంజనీరింగ్ ఈ ఈ సత్యనారాయణ, డి ఈ వన్నూరప్ప, శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా, పట్టణంలోని వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img