Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పదవ తరగతి పరీక్షలు పరి సమాప్తం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ మండలం నందు పదవ తరగతికి 3 పరీక్ష కేంద్రాలను కేటాయించారు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు 181 మంది విద్యార్థులను కేటాయించగా అందులో 176 మంది పరీక్షలు రాయిగా 5 మంది పరీక్షకు హాజరు కాలేదు ఈ కేంద్రానికి చీఫ్ సూపర్డెంట్ గా చంద్రశేఖర్ వ్యవహరించారు.శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు 260 మంది విద్యార్థులను కేటాయించగా అందులో 257 మంది హాజరు కాగా 3 హాజరు కాలేదనీ చీప్ సూపర్డెంట్ గా వ్యవహరించిన రంగప్ప తెలిపారు అలాగే జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు 211మంది విద్యార్థులను కేటాయించగా 209 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 2 మాత్రమే పరీక్షకు హాజరు కాలేదని చీప్ సూపర్డెంట్ గా వ్యవహరించిన జ్యోతిర్లత తెలిపారు ఈ పరీక్షలను శనివారం నాడు ఎంపీడీవో శివ శంకరప్ప తాసిల్దార్ స్వర్ణలత మరియు స్క్వాడ్ సిబ్బంది పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు అలాగే పరీక్ష కేంద్రాల నందు 144 సెక్షన్ అమలో ఉన్నందున పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి ప్రతిరోజు పరీక్ష కేంద్రాలను ఎస్సై రమేష్ బాబు తనిఖీ నిర్వహించారు అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించామని డివిజన్ వ్యాప్తంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు సజావుగా జరిగాయి అని జిల్లా ఉపా విద్యాశాఖ అధికారి రంగస్వామి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img