Friday, April 26, 2024
Friday, April 26, 2024

పన్నుపై వడ్డీ మాఫీనీ ఏప్రిల్ 30వ తేదీ లోపు చెల్లించ వచ్చు.. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణములోని ప్రజలందరూ పురపాలక సంఘమునకు బకాయి ఉన్న ఆస్తి ,కాళీ జాగా పన్నులకు వడ్డీ మాఫీ ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువు కలదని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గురువారం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న పాత బకాయిలు పన్నుపై విధించిన వడ్డీని ఏక మొత్తంగా మాఫీ చేయడం జరుగుతుందన్నారు. ఈ వడ్డీ మాఫీ పొందాలనుకునేవారు బకాయి ఉన్న మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరముతో సహా ఒకేసారి ఏక మొత్తంగా ఈనెల 30వ తేదీ చెల్లించినట్లయితే వడ్డీ మినహాయింపు తప్పక వర్తిస్తుందని తెలిపారు. కావున ఆస్తి పన్ను చెల్లింపు దారులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తాము చెల్లించే పనులను ఆన్లైన్ ద్వారా గాని, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డుల ద్వారా గాని, యూపీఐ ద్వారా గాని, మున్సిపల్ కార్యాలయము నందు గాని, ఎల్పీ సర్కిల్ నందు గల సచివాలయం, ఎల్సికాపురం లో గల సచివాలయంలో చెల్లించవచ్చునని తెలిపారు. పై విధంగా పన్ను చెల్లింపుదారులు త్వరపడి మీ బకాయిల మొత్తాన్ని వెంటనే చెల్లించి, వడ్డీ మాఫీ లబ్ది పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్, ఆర్వో.. ఆనంద్ పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img