Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పప్పు శెనగను ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలని రైతులు నిరసన

విశాలాంధ్ర-ఉరవకొండ : రైతులు పండించిన పప్ప సెనగను ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని కోరుతూ బుధవారం ఉరవకొండ మార్కెట్ యార్డులో రైతులు నిరసన తెలిపారు. పప్ప సెనగకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఈ సంవత్సరం పెద్ద సంఖ్యలో పప్పు సెనగ దిగుబడి వచ్చిందని అయితే గిట్టుబాటు ధర లేక రైతులు పప్పు శనగను అమ్ముకోలేక పొలాల వద్ద రాశులు పోసుకొని ఉన్నారని ప్రభుత్వం తక్షణమే స్పందించి పప్పు సెనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అలాగే ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు ధర కేవలం 4400 ఉందని దీనివల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున ప్రభుత్వం 6600 రూపాయలకు కొనుగోలు చేసి రైతులను అన్ని విధాల ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వం రైతుల పండించిన పంటలను తామే కొనుగోలు చేస్తామని గిట్టబాటు ధర కూడా కల్పిస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. రైతులు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి రైతు సంఘం నాయకులు మధుసూదన్ నాయుడు తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మురళి, వీరాంజనేయులు, సిద్ధప్ప రైతులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img