Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పింఛన్లు తొలగింపుపై టిడిపి పార్లమెంటు అధ్యక్షులు శ్రీ బి కే పార్థసారథి ధర్నా

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 6,571 మంది వృద్ధాప్య, వికలాంగ, వితంతు, ఒంటరి మహిళల, చేనేత కార్మికుల, డప్పు కళాకారుల, చర్మకారుల, మత్య్సకారుల, కల్లుగీత కార్మికుల, కిడ్నీ బాధితుల పింఛన్లు తొలగించారు. రోద్దం మండలానికి సంబంధించి 35 మంది వికలాంగుల పింఛన్లు తొలగించారు. ఈ విషయమై టిడిపి హిందూపురం పార్లమెంటు అధ్యక్షులు, పెనుకొండ మాజీ ఎమ్మెల్యే, పెనుకొండ అసెంబ్లీ ఇంచార్జీ శ్రీ బి కే పార్థసారథి గారి ఆధ్వర్యంలో రోద్దం ఎమ్ పి డి ఒ కార్యాలయం ఎదుట వికలాంగులతో కలసి ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు. తరువాత బి కే పార్థసారథి గారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 6,571 మందికి పింఛన్లు తొలగించారని, అదే విధంగా రోద్దం మండలానికి చెందిన అర్హులైన 35 మంది అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. రోద్దం మండల అధికారులు స్పందించి అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి హిందూపురం పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, టిడిపి హిందూపురం పార్లమెంటు అధికార ప్రతినిధి రోద్దం నరసింహులు, టిడిపి సీనియర్ నాయకులు జి వి పి నాయుడు, మండల కన్వీనర్ చంద్రమౌళి, మాజీ జెడ్పిటిసి చిన్నప్పయ్య, ఎమ్. కొత్తపల్లి సర్పంచి నాగరాజు, బీదానిపల్లి సర్పంచి మంజూ, తాడెంగీపల్లి సర్పంచి మంజూ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరామిరెడ్డి, మాజీ సర్పంచ్లు అశ్వర్థనారాయణ, నారాయణప్ప, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు టేలర్ ఆంజనేయులు, మాజీ హాస్పిటల్ కమిటీ చైర్మన్ ఎమ్. ఎస్. నాగరాజు, మాజీ ఎమ్ పి పి నరహరి, గుట్టురు సుబ్బరాయుడు, నాగరాజు, గోవిందు, ఉగ్రప్ప, ఐ-టిడిపి, తెలుగు యువత మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img