Friday, April 19, 2024
Friday, April 19, 2024

పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించండి…

సీపీఐ,సీపీఎం కమ్యూనిస్టులకు అవకాశం కల్పించండి…

  • మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థల్లో
పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా
మాజీ ఎం ఎల్ సి డాక్టర్ గయానంద్ మాట్లాడుతూ పట్టుభద్రుల నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పోతుల నాగరాజు, టీచర్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి శాసన మండలికి పంపాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి అనేకమైన హామీలు ఇచ్చారు ప్రధానంగా మన ప్రాంతంలో నిరుద్యోగ ఉద్యోగ, కార్మిక సమస్యల పైన శాసనమండలలో ప్రజా గళం వినిపిస్తామని చెప్పి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఇప్పటివరకు కనిపించని పరిస్థితి ఉందన్నారు.డాక్టర్ పోతుల నాగరాజు తన ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తినే వదిలేసుకుని మన ప్రాంతంలో అనేక సమస్యలు నడుమ నలిగిపోతున్న నిరుద్యోగ, ఉద్యోగ ,కార్మిక ,విద్యార్థి సమస్యల పైన నిరంతరం రాజిలేని పోరాటలు చేస్తున్న వ్యక్తిని శాసనమండలికి పంపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు.టీచర్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో కత్తి నరసింహారెడ్డి గెలిచిన తర్వాత నాటి నుంచి నేటి వరకు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పైన,సీపీఎస్ పైన, రాజిలేని పోరాటాలు చేస్తూ ఉపాధ్యాయులు,అనేక సమస్యలపై శాసనమండలిలో మన వాయిస్ వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము కావున ఇలాంటి వారిని శాసనమండలికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ జి ఎస్ డిగ్రీ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ఆర్ కె నాయుడు, బి.శ్రీనివాసులు, దాసరి శ్రీనివాసులు,కసాపురం రమేష్,సాకే నాగరాజు, జగ్గలి రమేష్ , తిమ్మప్ప,రాము నాయక్ ,చరణ్ ,వెంకీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img